కుమారస్వామికి ఢోకా లేదు

కుమారస్వామికి ఢోకా లేదు

రాష్ట్రంలో కాంగ్రెస్-జెడిఎస్ ల సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతుందని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి జి పరమేశ్వర స్పష్టం చేశారు. తమ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రతిపక్షం చేస్తున్న కుట్రలను సాగనివ్వబోమని చెప్పారు. ముఖ్యమంత్రి హెచ్ డి కుమారస్వామి నాయకత్వంపై కాంగ్రెస్ నేత సిద్దరామయ్య సైతం విశ్వాసం వ్యక్తం చేశారని పరమేశ్వర తెలిపారు. సంకీర్ణాన్ని కొనసాగించాలన్న నిర్ణయం నేతలు అందరూ చర్చించి తీసుకున్నట్టు ఆయన వివరించారు. 

నిన్న ప్రకటించిన లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో కర్ణాటకలో కాంగ్రెస్, జెడిఎస్ పార్టీలు చెరో సీటు మాత్రమే గెలుచుకోగలిగాయి. బీజేపీ తాను పోటీ చేసిన 27 లోక్ సభ నియోజక వర్గాలకు 25  స్థానాలను కైవసం చేసుకొని ఘన విజయం సాధించింది. కాంగ్రెస్, జెడిఎస్ నేతలు ఒకరిని మరొకరు విశ్వసించకపోవడం, వెన్నుపోట్లు, సీట్ల పంపకాలపై స్పష్టత లేకపోవడం, పార్టీల కార్యకర్తల్లో అవగాహన లోపం రెండు పార్టీల కొంప ముంచింది.