గవర్నర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ధర్నా..

 గవర్నర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ధర్నా..

సంఖ్యా బలం లేకున్నా  ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని గవర్నర్‌ ఆహ్వానించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌, జేడీఎస్‌ నేతలు ఇవాళ ఆందోళన బాట పట్టారు. ముందుగా రాజ్‌భవన్‌ వద్ద ధర్నాకు దిగి.. ఆ తర్వాత అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. గులాం నబీ ఆజాద్, అశోక్ గెహ్లాట్, మల్లికార్జునఖర్గే, కేసీ వేణుగోపాల్, సిద్ధరామయ్య తదితరులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. బీజేపీ నిజస్వరూపాన్ని ప్రజల్లో ఎండగడతామని మాజీ సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. తమ న్యాయపోరాటంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని కాంగ్రెస్‌, జేడీఎస్‌లు నిర్ణయించాయి.