అందుకే కాంగ్రెస్- టీడీపీ కలిసి పనిచేస్తున్నాయి..

 అందుకే కాంగ్రెస్- టీడీపీ కలిసి పనిచేస్తున్నాయి..

కాంగ్రెస్‌ పార్టీ తనకు సీటు ఇవ్వటం బహుమతి కాదని, బాధ్యతని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి వ్యాఖ్యానించారు. ఆదివారం ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన టీడీపీ సమన్వయ కర్తల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేణుకా చౌదరి మాట్లాడుతూ.. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీని గద్దె దింపేందుకే కాంగ్రెస్- టీడీపీ కలిసి పనిచేస్తున్నాయని అన్నారు. టీడీపీ-కాంగ్రెస్ కార్యకర్తలకు ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకమని అన్నారు. కేంద్రంతో పోరాడేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమైనా.. ఎన్‌టీ రామారావా?.. కేసీఆర్‌కు అధికార బలం ఉంటే! నాకు కార్యకర్తల బలం ఉంది అని అన్నారు. ఎంపీ అభ్యర్థిగా ఖమ్మంలో తనకు మద్దతు ఇవ్వాలని టీడీపీ నేతలని రేణుకా చౌదరి కోరారు. 

నేను బిజినెస్ మెన్ ని కాదు..కాంట్రాక్టు పనులు చేయను. నేను చేసిన అభివృద్ధి ఎవరు చేయించలేరు. ఖమ్మం మిర్చి రైతులకు సంకెళ్లు వేసిన చరిత్ర టిఆర్ఎస్ పార్టీది. టీఆర్ఎస్ గురించి..కేసీఆర్ గురించి మాట్లాడటం వేస్ట్. కేసీఆర్ నామా పై చేసిన వ్యాఖ్యలు నమ్మాలి. నామా కి ఓటేస్తే ఖమ్మం ప్రజలకు పంగ నామాలు పెడతారని చెప్పాడు. అది నిజం. ఊర్లలోకి టీఆర్ఎస్ నాయకులను రానివ్వకండి. అని రేణుకా చౌదరి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, టీడీపీ సీనియర్ నేత కోనేరు చిన్ని తదితరులు పాల్గొన్నారు.