కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన కుష్బూ... రేపు బీజేపీలోకి...!!

కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన కుష్బూ... రేపు బీజేపీలోకి...!!

సినిమాల ద్వారా దక్షిణాదిన మంచి గుర్తింపు తెచ్చుకున్న కుష్బూ తరువాత రాజకీయాల్లోకి వచ్చారు.  కాంగ్రెస్ పార్టీలో జాతీయ అధికారిక ప్రతినిధిగా పనిచేసిన కుష్బూ గత కొన్ని రోజులుగా పార్టీకి దూరంగా ఉంటున్నారు.  ఇటీవలే కేంద్రం తీసుకొచ్చిన కొత్త విద్యాపాలసీని సమర్ధించారు.  దీంతో కాంగ్రెస్ పార్టీ కుష్బూపై సీరియస్ అయ్యింది.  అప్పటి నుంచే కుష్బూ బీజేపీలో చేరబోతున్నట్టు వార్తలు వచ్చాయి.  ఆ వార్తలను ఆమె ఖండించలేదు.  ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. తాజాగా, కుష్బూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆ పార్టీకి షాక్ ఇచ్చింది.  పార్టీకి రాజీనామా చేసిన కుష్బూ రేపు మధ్యాహ్నం బీజేపీలో చేరబోతున్నారు.  కుష్బూ రాకతో తమిళనాడు బీజేపీకి కొత్త గ్లామర్ వచ్చినట్టే అని చెప్పాలి.  వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో కుష్బూ చేరికతో బీజేపీకి కొంతమేర అదనపు బలం పెరుగుతుందని చెప్పొచ్చు.