ఆ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలి

ఆ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలి

పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసేందుకు ముందుకు వచ్చింది. ఆ పార్టీ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీ నేతృత్వంలోని బృందం పార్టీ ఫిరాయింపులపై గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్‌ను వీడుతున్నట్టు చెప్పిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను కోరారు. వారిపై అనర్హత వేటు వేసేలా స్పీకర్ కు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఏడు పేజీల వినతిపత్రాన్ని గవర్నర్‌కు అందజేశారు.