జోగిని శ్యామల చెప్పింది నిజమవుతుంది

జోగిని శ్యామల చెప్పింది నిజమవుతుంది

ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా జోగిని శ్యామల పెట్టిన శాపం ప్రభుత్వానికి మంచిది కాదని కాంగ్రెస్ నేత వీ హనుమంతరావు అన్నారు. శ్యామల చెప్పింది నిజమైతదని, తెలంగాణలో కేసీఆర్‌ నియంతృత్వపాలన ముగియక తప్పదని జోస్యం చెప్పారు. కవిత బోనం ఎత్తుకుంటేనే బోనాల పండుగ అన్నట్లు ప్రభుత్వ ప్రచారం చేస్తోందని వీహెచ్‌ మండిపడ్డారు. సమగ్ర కుటుంబ సర్వే ఫలితాలు ఉండగా ఇప్పుడు బీసీ గణన ఎందుకుని ప్రశ్నించారు. అధికారులకు పదవీ కాలాన్ని పొడిగిస్తున్న కేసీఆర్‌.. సర్పంచులకు ఇంఛార్జి ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు కావాలనే నిర్వహించడంలేదని వీహెచ్‌ అభిప్రాయపడ్డారు. గ్రామాలకు ప్రత్యేక అధికారుల వస్తే తరిమి కొట్టండని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వచ్చే ఎన్నికల్లో తాము తప్పక గెలుస్తామని,  ముఖ్యమంత్రి ఎవరవుతారన్నది మా హైకమాండ్‌ నిర్ణయిస్తుందని వీహెచ్‌ అన్నారు.