ప్రభుత్వం కోల్పోతుందని ముందే తెలుసు

ప్రభుత్వం కోల్పోతుందని ముందే తెలుసు

ఈసారి ఎన్నికలలో మహాకూటమికి దాడికి ప్రభుత్వం కోల్పోతుందని కేసీఆర్ కి ముందే తెలుసు అని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. నేడు ఆయన మాట్లాడుతూ... ఇప్పటి వరకు ఒకే  ఒక్కసారి ఓటమి పాలయ్యాను, ఈ నియోజకవర్గ ప్రజలు 7సార్లు ఎమ్మెల్యేగా గెలిపించినందుకు వారికి కృతజ్ఞతలు. టీఆర్ఎస్ ప్రభుత్వం మాయ మాటలు చెప్పి 9 నెలల ముందే ఎన్నికలకు దిగింది. దీనికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో మాయ మాటలు చెప్పి ప్రభుత్వంని ఏర్పాటు చేశారు.. కానీ ఈసారి మహాకూటమికి దాడికి ప్రభుత్వం కోల్పోతుందని కేసీఆర్ కి ముందే తెలుసన్నారు. నాగార్జున సాగర్ ప్రజల విజయం మహాకూటమి విజయంగా చెప్పుకోవచ్చు అని ఆయన పేర్కొన్నారు. ముందస్తుకు పోయి ప్రజలను గందరగోళం గురి చేస్తూ 300 కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని జానారెడ్డి విమర్శించారు. ఒక్క కుటుంబానికి ఒకటే సీటు అనే నిభందనకు కట్టుబడి ఉన్నాం కాబట్టే మిర్యాలగూడలో మా కుమారుడిని కాకుండా బీసీ సామాజిక వర్గానికి కేటాయించి కాంగ్రెస్ తన ఔన్నత్యాన్ని చాటుకుంది అని అన్నారు.