టీఆర్ఎస్ క్యాంపు రాజకీయాలపై కోమటిరెడ్డి ఫైర్

టీఆర్ఎస్ క్యాంపు రాజకీయాలపై కోమటిరెడ్డి ఫైర్

టీఆర్ఎస్ క్యాంపు రాజకీయాలపై కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో భువనగిరి స్థానం ప్రత్యేకమైందని అన్నారు. నన్ను గెలిపించేందుకు కృషి చేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. దేశంలోనే ఎలాంటి ఇబ్బంది లేకుండా గెలవబోతున్న స్థానం భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గమని వ్యాఖ్యానించారు. 80వేల నుంచి లక్ష మెజారిటీతో గెలవబోతున్నట్లు కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

'తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరేసేందుకు పనిచేస్తాం. గ్రామాల్లో మంచినీళ్లు లేకపోతే పట్టించుకోని తుంగతుర్తి ఎమ్మెల్యే కిషోర్ ఒక ఎమ్మెల్సీ ఎన్నిక కోసం క్యాంపు రాజకీయాలు చేస్తున్న తీరు సిగ్గుచేటు. ఇంటర్ ఫలితాల అవకతవకలపై స్పందించని విద్యాశాఖ మంత్రి షిప్ లో ముంబై, గోవా టూరుకు వెళ్లిన మంత్రిని ఏమనాలి. ఆరుగురు మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు కోట్ల రూపాయలు ఖర్చు చేసి క్యాంపు రాజకీయాలు చేస్తూ జల్సాలు చేస్తున్నారు' అని కోమటిరెడ్డి మండిపడ్డారు.