కాంగ్రెస్ నేత ఆగ్రహం.. ప్రచార సామగ్రికి నిప్పు

కాంగ్రెస్ నేత ఆగ్రహం.. ప్రచార సామగ్రికి నిప్పు

ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ కాంగ్రెస్ యువనేత క్రిశాంక్  టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పార్టీలో తనకు అవమానాలే ఎదురవుతున్నాయంటూ ఆవేదన చెందారు. ఉత్తమ్‌ తీరును నిరసిస్తూ సుమారు రూ.15 లక్షలలో సిద్ధం చేసుకున్న ఎన్నికల సామగ్రిని పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. తాను పార్టీని వీడుతున్నట్టు తెలిసినా ఉత్తమ్‌ కనీసం స్పందించలేదని అసహనం వ్యక్తం చేశారు క్రిశాంక్‌. ఎన్నికల్లో టికెట్‌ లభిస్తుందన్న నమ్మకంతో ప్రచారానికి పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టానని చెప్పారు.  సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి అసెంబ్లీ టికెట్‌ ఆశించి భంగపడ్డ క్రిశాంక్‌కు.. లోక్‌సభ టికెట్‌ విషయంలోనూ చుక్కెదురైంది.