ప్రధాని మోడీపై కాంగ్రెస్ నేత సంచలన ట్వీట్...
ఆయోధ్యలో ప్రధాని మోడీ చేతుల మీదుగా భూమి పూజ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మధ్యాహ్నం 12.44 గంటల నుంచి 12.45 మధ్య భూమి పూజను నిర్వహించారు. శ్రీరాముడు జన్మించిన అభిజిత్ ముహూర్తంలోనే భూమి పూజ జరిగింది. ఈ వేడుకను కోట్లాది మంది భారతీయులు తిలకించారు. భూమిపూజపై కాంగ్రెస్ నేతలు పలురకాల కామెంట్లు చేస్తున్నారు.
ప్రధాని మోడీ శ్రీరాముడి కంటే పెద్దగా ఉన్నారని చెప్పి వ్యంగ్యంగా ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ శోభా కరంద్లాజే తన సోషల్ మీడియాలో ఓ ఫోటోను పోస్ట్ చేసి ట్వీట్ చేశారు. ఇందులో ప్రధాని మోడీ బాల రాముడి చేయి పట్టుకొని నడిపించుకుంటు అయోద్యవైపు వెళ్తుంటాడు. ఈ ఫోటో వైరల్ అయ్యింది. తిరిగి రాముడిని అయోధ్యలోకి తీసుకెళ్తున్నారని బీజేపీ నేతలు ట్వీట్ చేస్తుంటే, కాంగ్రెస్ నేతలు మాత్రం విమర్శిస్తూ వ్యంగ్యంగా ట్వీట్ చేస్తున్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)