చిదంబరానికి ఈడీ పిలుపు

చిదంబరానికి ఈడీ పిలుపు

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి చిదంబరానికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ప్రశ్నించేందుకు సమన్లు జారీ చేసింది. ఈ కేసులో ఆయన కుమారుడు కార్తీ చిదంబరం కూడా నిందితుడు. ఆయన్ను ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో ప్రశ్నించనున్నారు. విచారణ నిమిత్తం ఈడీ ఎదుట హాజరు కావాలని సమన్లలో పేర్కొన్నారు. దీంతో ఆయన విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ కేసుల్లో చిదంబరానికి ఢిల్లీ హైకోర్టు గత నెలలో ఊరట కల్పిచింది.  జనవరి 15 వరకు ఆయనను అరెస్టు చేయకుండా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన రూ. 3,500కోట్ల ఎయిర్‌సెల్‌-మ్యాక్సిస్‌ ఒప్పందం, రూ. 305కోట్ల ఐఎన్‌ఎక్స్‌ మీడియా ఒప్పందంలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. దీంతో దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాయి. ఐఎన్ఎక్స్‌ మీడియాలో విదేశీ పెట్టుబడులకు ప్రభుత్వ అనుమతి ఇవ్వడంలో చిదంబరం అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుపై ఈడీ, సీబీఐ దర్యాప్తు చేస్తున్నాయి.