'భయపెట్టి ఓట్లు వేయించుకున్నారు..!'

'భయపెట్టి ఓట్లు వేయించుకున్నారు..!'

తెలంగాణలో వెలువడిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లో కారు స్పీడును ఆపడం ఎవరితరం కాదన్న రీతిలో టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. అయితే, టీఆర్ఎస్ నేతలు భయపెట్టి ఓట్లు వేయించుకున్నారని ఆరోపించారు మాజీ మంత్రి షబ్బీర్ అలీ... పరిషత్ ఎన్నికల ఫలితాలపై కామారెడ్డిలో స్పందించిన ఆయన... పరిషత్ ఎన్నికల ఫలితాల్లో పట్టణ ప్రాంత ఓటర్లు కాంగ్రెస్ కే  ఓటేశారి.. గ్రామీణ ప్రాంతాల్లో టీఆర్ఎస్ పార్టీ నేతలు భయ బ్రాంతులకు గురి చేసి ఓట్లు వేయించుకున్నారని విమర్శించారు. టీఆర్ఎస్‌కు ఓటు వేయకుంటే పెన్షన్లు ఆగిపోతాయని, ప్రభుత్వ పథకాలు అందవని భయపెట్టడంతో ఓటర్లు టీఆర్ఎస్ కు ఓటు వేశారని అభిప్రాయపడ్డ షబ్బీర్ అలీ... పరిషత్ ఎన్నికల ఫలితాలు మున్సిపల్ ఎన్నికల్లో రిపీట్ కావని.. మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ హవానే కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.