మా పోరాటంతోనే కేసీఆర్ వెనక్కి తగ్గారు..!

మా పోరాటంతోనే కేసీఆర్ వెనక్కి తగ్గారు..!

కాంగ్రెస్ పార్టీ పోరాటం కారణంగానే బైసన్ పోలో గ్రౌండ్‌లో సచివాలయాన్ని నిర్మించాలని తలపెట్టిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెనక్కి తగ్గారన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు... బైసన్‌ పోలో గ్రౌండ్‌లో సచివాలయాన్ని నిర్మించొద్దని కాంగ్రెస్ పోరాటం చేసిందని.. దీంతో అక్కడ సచివాలయ నిర్మాణాన్ని కేసీఆర్ ఉపసంహరించుకున్నారని తెలిపారు. బైసన్ పోలో గ్రౌండ్‌లో సచివాలయ నిర్మాణం విషయంలో ప్రభుత్వం వెనకడుగు వేయడం వల్ల క్రీడాకారులకు మేలు జరుగుతుందన్న వీహెచ్... క్రీడాకారులు ఆ గ్రౌండ్ ను బాగా ఉపయోగించుకొని జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనాలని సూచించారు. ఇక దేవానికి క్రీడాకారులు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కొత్త క్రీడాకారులను సీఎం కేసీఆర్ ప్రోత్సహించాలని కోరిన వీహెచ్... మరోవైపు ఎల్బీ స్టేడియంలో పార్టీ మీటింగ్‌లకు అనుమతి ఇవ్వొద్దని విజ్ఙప్తి  చేశారు.