శ్రీనివాస్‌రెడ్డిని ఎన్‌కౌంటర్ చేయాల్సిందే..!

శ్రీనివాస్‌రెడ్డిని ఎన్‌కౌంటర్ చేయాల్సిందే..!

యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్ హత్యల ఘటనా స్థలాన్ని పరిశీలించారు కాంగ్రెస్ సీనియర్ నేతలు వీ హెచ్.. సైకో కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డిని ఎన్‌కౌంటర్ చేయాలని. బాధితుల కుటుంబాలకు రూ. 20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ముగ్గురు అమ్మాయిలను దారుణంగా హత్య చేసిన నిందితుడిని జైళ్లో పెట్టి బెయిల్ పై విడుదల అయ్యేలా చేయొద్దని విజ్ఞప్తి చేశారు వీహెచ్. సైకో కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డి మరో నయీం లాంటివాడని మండిపడ్డ వీహెచ్.. ఎన్‌కౌంటర్ చేయాల్సిందేఅన్నారు. కల్పన మిస్సింగ్‌, హత్యపై పోలీసులు వెంటనే స్పందించి విచారణ జరిపిఉంటే.. మరో రెండు హత్యలు జరిగిఉండేవి కాదన్నారు. హాజీపూర్‌కు బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో నంబర్ వన్ అని కేసీఆర్ చెబుతారు.. ఇంటర్ ఫలితాల్లో, మహిళలపై అఘాయిత్యాల్లో కూడా నంబర్ వనే అంటూ మండిపడ్డారు వీహెచ్.