ఢిల్లీలో దీక్షకు సిద్ధమైన వీహెచ్..

ఢిల్లీలో దీక్షకు సిద్ధమైన వీహెచ్..

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు అలియాస్ వీహెచ్.. ఢిల్లీలోని నిరాహార దీక్షకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 11వ తేదీన ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో నిరాహార దీక్ష చేపట్టనున్నారు వీహెచ్. పంజాగుట్ట చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం తొలగింపుపై ఇప్పటికే పలు దఫాలుగా ఆందోళన, నిరసన కార్యక్రమాలు నిర్వహించిన వీహెచ్... ఇప్పుడు ఢిల్లీలోనే ఆందోళనకు సిద్ధమయ్యారు. మీడియాతో మాట్లాడిన వీహెచ్.. ఈ నెల 11వ తేదీన జంతర్‌మంతర్‌లో నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు వెల్లడించారు. పంజాగుట్టలోని అంబేద్కర్ విగ్రహానికి జరిగిన అన్యాయంపైనే దీక్ష చేస్తున్నానని... అసలు అంబేద్కర్ విగ్రహ ఏర్పాటును ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అని ఫైర్ అయ్యారు. ఎన్నికల కోడ్ పేరుతో అంబేద్కర్ విగ్నహాన్ని లాకప్‌లో ఉంచడం దారుణమైన విషయమని ఆవేదన వ్యక్తం చేసిన వీహెచ్... పంజాగుట్ట చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహాన్ని మళ్లీ ప్రతిష్టించాల్సిందేనని డిమాండ్ చేశారు.