'హాజీపూర్‌ సమస్యను డైవర్ట్‌ చేసే యోచన..!'

'హాజీపూర్‌ సమస్యను డైవర్ట్‌ చేసే యోచన..!'

యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్‌లో వెలుగుచూసిన సైకో కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డి ఇష్యూను ప్రభుత్వం డైవర్ట్ చేసే ఆలోచనలో ఉంది.. కానీ, పరిష్కారం కోసం ప్రయత్నం చేయడం లేదని మండిపడ్డారు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు. ఆ కుటుంబాలను పరామర్శించాలనే కనీస జ్ణానం లేదు... కానీ, కవిత కొడుకుకు బాగలేదని తాత పోయి చూసివచ్చిండని ఆగ్రహం వ్యక్తం చేశారు. హాజీపూర్ బాధితులకు రూ. 50 లక్షల చొప్పున సాయం చేయాలని డిమాండ్ చేసిన వీహెచ్. ఆ గ్రామానికి బస్సు సౌకర్యం, వంతెన నిర్మించడం వంటి వాటిపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. రాచకొండ సీపీ, నేను కొంత ఆర్థిక సహాయం వ్యక్తిగతంగా చేశాం... కానీ, ప్రభుత్వం మాత్రం ఆర్ధిక సహాయం ప్రకటించలేదని ఫైర్ అయ్యారు వీహెచ్. 

ఇక ఈ గవర్నర్ కేవలం తిరుపతి పూజారిగా మాత్రమే పనికి వస్తారని ఎద్దేవా చేసిన వీహెచ్... డాలర్ శేషాద్రి పక్కన గవర్నర్‌ను కూడా పెడితే కరెక్ట్ సెట్ అవుతారని వ్యాఖ్యానించారు. మేం ఏ వినతి ఇచ్చినా  గవర్నర్ దానిని చెత్త బుట్టలో వేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం కూల్చివేతపై ఆగ్రహం వ్యక్తం చేసిన వీహెచ్... హాజీపూర్ బాధితులకు న్యాయం జరిగే వరకు, అంబేద్కర్ విగ్రహం పెట్టే వరకు మేం పోరాటం చేస్తూనే ఉంటామని ప్రకటించారు. అధికార అహంతో కేసీఆర్ కళ్లు నెత్తికెక్కాయి... రెండేళ్ళలో ఈ ప్రభుత్వం పడిపోవాలని కోరుకుంటున్నానంటూ శాపనార్థాలు పెట్టేరు వీహెచ్.