పార్టీపై తీవ్ర అసంతృప్తి.. సమావేశం నుంచి వెళ్లిపోయిన వీహెచ్..

పార్టీపై తీవ్ర అసంతృప్తి.. సమావేశం నుంచి వెళ్లిపోయిన వీహెచ్..

కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు మరోసారి ఫైర్ అయ్యారు. పార్టీలోని నేతల వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన వీహెచ్... 11 మంది పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారినప్పుడే పిలిచి మాట్లాడాల్సింది అన్నారు. కానీ, ఇప్పుడు పిలిచి ఏం చేస్తారని అసంతృప్తి వ్యక్తం చేసిన వీహెచ్... పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఒక్కడే తిరిగి ఏం చేస్తారు? అని మండిపడ్డారు. పార్టీ కోసం పనిచేసేందుకు మేమంతా లేమా? అని ప్రశ్నించిన వి. హనుమంతరావు... బయట పార్టీ వాళ్లను తీసుకుని... మన పార్టీ వాళ్లను బయటకు పంపడం ఏంటి? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీని నమ్ముకుని ఏళ్ల తరబడి ఉంటున్నవారికి ఏం సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారని ఫైర్ అయిన వీహెచ్... సమావేశం జరుగుతుండగానే అర్ధాంతరంగా వెళ్లిపోయారు వి. హనుమంతరావు.