సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలి

సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలి

ఇంటర్ ఫలితాల గందరగోళంపై సీఎం బాధ్యత వహించాలని తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి డిమాండ్ చేశారు. మంగళవారం ఎన్టీవీతో ఆమె మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులకు బాధ్యతలు లేవని ఎద్దేవా చేశారు. విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకున్నా స్పందించరా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ప్రజా సమస్యలపై స్పందించడం మానేశారని వ్యాఖ్యానించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఇప్పుడున్న పౌరుషం కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ తీసుకున్నప్పుడు ఏమైందని మండిపడ్డారు. కష్టపడి గెలిపిస్తే.. ఎమ్మెల్యేలు అమ్ముడుపోయారని అన్నారు. పార్టీలోని చెత్త బయటికి వెళ్లిపోయిందని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలు పార్టీ మారినంత మాత్రాన జరిగేది ఏమీలేదన్నారు. మళ్లీ కొత్త రక్తం వస్తుంది.. తిరిగి అధికారంలోకి వస్తామని విజయశాంతి ధీమా వ్యక్తం చేశారు.