కొత్త ఇంచార్జ్ సహా టీ కాంగ్రెస్ నేతలు అరెస్ట్ !

కొత్త ఇంచార్జ్ సహా టీ కాంగ్రెస్ నేతలు అరెస్ట్ !

వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేశారు.. పోలీసులు. రాజ్‌భవన్ ముట్టడికి సిద్ధమైన కాంగ్రెస్ నేతలు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, భట్టిలను వ్యానులోకి ఎక్కించి గోషామహల్ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఉత్తమ్, భట్టిలే కాక సంపత్, రేవంత్, పొన్నం, కొత్త ఇంఛార్జి మణికం ఠాగూర్, ఎమ్మెల్యే సీతక్క, ఎమ్మెల్యే శ్రీధర్ బాబులను అరెస్ట్ చేసి గోషామహల్ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. దిల్ ఖుషా గెస్ట్ హౌస్ ముందు మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ నాయకులు రాజ్ భవన్ కు ర్యాలీ గా బయలుదేరారు. దిల్ కుషా గెస్ట్ హౌస్ గేటు వద్ద కాంగ్రెస్ నేతలను అడ్డుకున్న పోలీస్ లు కాంగ్రెస్ నేతలు అందరినీ అరెస్ట్ చేశారు.