మైకులు విసురుకున్న కాంగ్రెస్ నేతలు..!

మైకులు విసురుకున్న కాంగ్రెస్ నేతలు..!

కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువు..! ఆ పార్టీ నేతలు తిట్టుకుంటారు..! కొట్టుకుంటారా..! మళ్లీ ఒక్కటవుతారు. ఇక, నాగార్జునసాగర్‌లో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మైకులు విసురుకున్నారట పార్టీ సీనియర్ నేతలు. అయితే, విస్తృతస్థాయి సమావేశంలో రానున్న మున్సిపల్ ఎన్నికలకు ఇంచార్జ్‌లను నియమించాలని కొందరు నేతలు అభిప్రాయపడ్డారు.. కొత్తవాళ్లకు ఇస్తే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి... గతంలో పోటీచేసినవారికి బాధ్యతలు అప్పగించాలని.. ఓడిపోయినాసరే వారికి ఇస్తేనా బాగుంటుందని.. కొత్తవాళ్లు ఇస్తే వాళ్లకు ఏం తెలుస్తుంది? అని ప్రశ్నించడంతో చిన్న వివాదం మొదలైంది. జగ్గారెడ్డి వ్యాఖ్యలను కొందరు నేతలు తప్పుబట్టడంతో.. నేతల మధ్య కొంత వాగ్వాదం చోటుచేసుకోవడం.. కోపంతో ఊగిపోయిన జగ్గారెడ్డి మైకు విసిరేసినట్టు తెలుస్తోంది.