జీవన్‌రెడ్డికి సన్మానం..

జీవన్‌రెడ్డికి సన్మానం..

కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్‌ సీనియర్ నేత జీవన్‌రెడ్డిని ప్రశంసలతో ముంచెత్తారు కాంగ్రెస్ నేతలు. గాంధీభవన్‌లో జరుగుతోన్న సీఎల్పీ సమావేశానికి హాజరైన నేతలు... జీవన్‌రెడ్డిని సన్మానించారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యావహారాల ఇంచార్జ్ కుంతియా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి ,రాజగోపాల్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, గండ్ర వెంకటరమణ రెడ్డి, సీతక్క, శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ, కాంగ్రెస్ సీనియర్ నేత గీతారెడ్డి తదితరులు హాజరయ్యారు.