కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు వీహెచ్, నగేష్‌

కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు వీహెచ్, నగేష్‌

ఇందిరాపార్క్ దగ్గర కాంగ్రెస్ నేతలు కొట్టుకున్నారు.. కుర్చీ విషయంలో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు, మరోనేత నగేష్‌ మధ్య చెలరేగిన వివాదం కొట్టుకునేవరకు వెళ్లింది. ఆత్మహత్య చేసుకున్న ఇంటర్మీడియట్ విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ దగ్గర ధర్నా చేపట్టారు. అయితే, ఈ కార్యక్రమానికి వెళ్లిన వీహెచ్.. ఓ కుర్చీలో కుర్చునే సమయంలో నగేష్.. ఆ కుర్చీని కుంతియా కోసం తీసుకున్నారు. నా కుర్చీని ఎలా తీసుకుంటావంటూ అక్కడ వీహెచ్ వీరంగం సృష్టించాడు. ఉదయం గాంధీభవన్‌లో జరిగిన సమావేశంలోనూ పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సమావేశం నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయిన వీహెచ్.. ఆ తర్వాత నేరుగా ఇందిరాపార్క్ దగ్గరకు చేరుకున్నారు. అయితే, ఈ సమావేశంలో వీహెచ్ మాట్లాడుతున్న సమయంలో కుంతియా రావడం.. ఆయన ఆహ్వానించే సమయంలోనే కుర్చీల పంచాయతీ మొదలైంది. వీహెచ్, నగేష్‌ మధ్య తోపులాట జరగడంతో.. నగేష్‌పై ఓ దశలో మైక్‌తో దాడి చేశారు వీహెచ్.. అనంతరం నగేష్‌ కిందకి లాగడంతో వీహెచ్ స్టేజీ పై నుంచి కింద పడిపోయారు.