మంత్రివర్గం ఊసేది : మధుయాష్కీ

మంత్రివర్గం ఊసేది : మధుయాష్కీ

వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం అవుతున్నామని తెలంగాణ మీడియా కమిటీ చైర్మన్ మధు యాష్కీ అన్నారు.  మీడియాతో ఆయన మాట్లాడుతూ.. జిల్లా కమిటీలు 15 వ తేదీ వరకు పూర్తి చేస్తామని చెప్పారు. టిఆర్ఎస్, ఎంఐఎంలు బీజేపీ కి బీ టీమ్ లని , పార్లమెంట్ ఎన్నికల్లో  టిఆర్ఎస్ 16 ఎంపీలు గెలిచినా వచ్చే లాభమే లేదని మధుయాష్కీ  చెప్పుకొచ్చారు.  కానీ కాంగ్రెస్ గెలిస్తే... రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని, ఇచ్చిన హామీలను అమలు చేస్తుందన్నారు. రాజు మాదిరిగా... సొంత పార్టీ ఎమ్మెల్యే లనే కూలీలుగా మార్చుకున్న అహంకారి కేసీఆర్ అని మండిపడ్డారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలన సరిగా జరగాలంటే..  కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ప్రజలను కోరారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని భయంతో నే, మంత్రుల్ని కూడా నియమించడానికి  కేసిఆర్ జంకుతున్నారని మధుయాష్కీ విమర్శించారు.