ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు పెళ్లి చేసుకోబోతున్నారు..!!

ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు పెళ్లి చేసుకోబోతున్నారు..!!

ఉద్యోగులను ఉద్యోగులు, డాక్టర్లను డాక్టర్లు, యాక్టర్లను యాక్టర్లు పెళ్లి చేసుకుంటూ ఉంటారు. అయితే, రాజకీయాల్లో ఉండే వ్యక్తులు.. రాజకీయాల్లోనే ఉండే వ్యక్తులను ఎందుకు పెళ్లిళ్లు చేసుకోరు.  అలా చేసుకుంటే ఇద్దరికీ ఇబ్బందే.  నిత్యం ఇద్దరు ప్రజా పనుల్లో బిజీగా ఉండే అవకడం ఉంటుంది.  అందుకే రాజకీయ రంగంలో ఉండే వ్యక్తులు అదే రంగంలో ఉండే వ్యక్తులను పెళ్లి చేసుకోవడానికి ఒకటికి నాలుగు మార్లు ఆలోచిస్తారు.  

ఇక ఇదిలా ఉంటె, ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలికి కాంగ్రెస్ ఎమ్మెల్యే అతిధి సింగ్, పంజాబ్ లోని షహీద్ భగత్ సింగ్ నగర్ ఎమ్మెల్యే అంగద్ సింగ్ లు వివాహం చేసుకోబోతున్నారు.  ఇద్దరు మొదటిసారి అసెంబ్లీకి ఎంపికయ్యారు.  అంగద్ కంటే.. అతిధి నాలుగేళ్లు పెద్ద.  అయినప్పటికీ ఇద్దరు వివాహం చేసుకోబోతున్నారు నవంబర్ 21న ఢిల్లీలో వివాహం జరగబోతున్నది.  అలానే నవంబర్ 23 వ తేదీన రిసెప్షన్ ను ఏర్పాటు చేస్తున్నారు.