కాంగ్రెస్ పార్టీకి హరిప్రియ నాయక్ రాజీనామా

కాంగ్రెస్ పార్టీకి హరిప్రియ నాయక్ రాజీనామా

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు వరుస షాకులు తగులుతున్నాయి. ఈరోజు ఉదయమే మాజీ హోం మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడనున్నారనే వార్తలు వచ్చాయి. ఈ భారీ షాక్ నుండి తేరుకోకముందే కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. ఖమ్మం జిల్లాకు చెందిన ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.

'ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ గారితో గిరిజన ప్రాంత అభివృద్ధిపై చర్చించాం. సీఎం మాట్లాడిన మాటలు స్వార్ధ రాజకీయాల కోసం కాకుండా రాష్ట్రాభివృద్దే ద్యేయంగా ప్రస్ఫుటించాయి. మా ప్రాంత అభివృద్ధి కోసం చేసిన రూప కల్పన నన్ను ఆకర్షించింది. ఇల్లందు ప్రాంతం, మా ప్రాంత గిరిజన అభివృద్ధి చెందాలన్నా సీఎంగారి బాటలో నడవడం శ్రేయస్కరం అని భావించాను' అని హరిప్రియ లేఖలో పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ బీ ఫామ్‌పై పోటీ చేసేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నానన్నారు.