ఫోన్ నిజమే... బయటకు చెప్పలేను..!

ఫోన్ నిజమే... బయటకు చెప్పలేను..!

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీతో గట్టి ఎదురుదెబ్బలు తిన్న కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు బీజేపీ కూడీ పెద్ద దెబ్బ కొట్టబోతోందనే చర్చ సాగుతోంది. బీజేపీలో చేరేందుకు సిద్ధమైన కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తనతో పాటు మరికొందరిని తీసుకువెళ్లే యోచనలో ఉన్నారనే చర్చ సాగుతోంది. అందులో భాగంగానే కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి రాజగోపాల్ రెడ్డి ఫోన్‌ చేసినట్లు వార్తలు వచ్చాయి. మీడియా చిట్‌చాట్‌లో ఈ వ్యవహారంపై స్పందించిన జగ్గారెడ్డి... తనకు రాజగోపాల్ రెడ్డి ఫోన్ చేసింది వాస్తవమేనని ఒప్పుకున్నారు. మా మధ్య జరిగిన సంభాషణ బయటకు చెప్పలేనన్న ఆయన.. ప్రస్తుత పరిస్థితిలో కాంగ్రెస్ నాయకులు టిఆర్ఎస్‌లోకి కానీ... బీజేపీలోకి కానీ వెళ్తారని తాను అనుకోవడం లేదన్నారు. నేను కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఆశిస్తున్నానని తన అభిప్రాయాన్ని బయటపెట్టిన జగ్గారెడ్డి... పార్టీ మారతా... అనే చర్చ పక్కన పెట్టండి అని కోరారు. అయితే, తాను వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఆశిస్తున్నానని... పార్టీకి 10 మంది వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉన్నా నష్టం లేదని వ్యాఖ్యానించారు జగ్గారెడ్డి. ఇక కార్యకర్తలు క్లారిటీ తోనే ఉన్నారు.. నాయకులే కన్ఫ్యూజన్ లో ఉన్నారన్నారు జగ్గారెడ్డి.