డబ్బులు లేకే ఓడిపోయాం..!

డబ్బులు లేకే ఓడిపోయాం..!

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు రూలింగ్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాజగోపాల్ వాళ్ల దగ్గర డబ్బులు లేకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయారన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి... మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడిన ఆయన... వరుస ఎన్నికలతో కాంగ్రెస్ నాయకులమంతా అప్పుల పాలయ్యామన్నారు. రూలింగ్ పార్టీ దగ్గర డబ్బులు ఉన్నాయి.. మా దగ్గర డబ్బులు లేకే ఓడిపోయామన్నారు జగ్గారెడ్డి. ఇక హుజుర్‌నగర్ అసెంబ్లీకి ఉపఎన్నికలు వస్తే... ఉత్తమ్‌కుమార్ రెడ్డి కుటుంబం నుంచి అభ్యర్థి అయితేనే గెలుపు సాధ్యమన్న జగ్గారెడ్డి... పీసీసీ చీఫ్ ఉత్తమ్ దగ్గర డబ్బులు లేకుంటే అప్పు తెచ్చైనా గెలుస్తారని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ నాయకులు మాట మనుషులు కాబట్టి.. అప్పులు ఇస్తారన్న జగ్గారెడ్డి... కాంగ్రెస్ కి డబ్బులు లేకపోయినా.. కార్యకర్తలే ప్రధాన బలంగా చెప్పుకొచ్చారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు పోటా పోటీగానే ఉంటాయన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే... జెడ్పీటీసీ ఫలితాలు టీఆర్ఎస్.. కాంగ్రెస్ మధ్యే ఉంటాయన్న ఆయన... మరోవైపు శాసన మండలిలో 35 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఒక్కటే... కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఒక్కడు ఉన్నా ఒక్కటేనన్నారు. ప్రజాసమస్యలపై... ప్రభుత్వాన్ని ప్రశ్నించేది ఒక్క జీవన్ రెడ్డియే అన్నారు జగ్గారెడ్డి.