హరీష్‌రావుకు జగ్గారెడ్డి సవాల్..

హరీష్‌రావుకు జగ్గారెడ్డి సవాల్..

మాజీ మంత్రి హరీష్‌రావుకు సవాల్ విసిరారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి... జగ్గారెడ్డి కేసులకు బయపడుతున్నాడని.. జగ్గారెడ్డి ఏటీఎంలు ఏమైనాయన్న హరీష్ వ్యాఖ్యలపై మండిపడ్డ ఆయన.. సంగారెడ్డిలో నిర్వహించిన మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. జగ్గారెడ్డి కేసులకు భయపడే వ్యక్తి కాదు... అలా బయాడితే గత నాలుగేళ్ల కాలంలో ప్రభుత్వంపై పోరాటం చేసేవాడిని కాదన్నారు. అవును నేను ఆపదలో ఉన్న వారికి కచ్చితంగా ఏటీఎంనే... నా సంగారెడ్డి ప్రజలకు ఆ విషయం తెలుసు... నేను ఎంతమందికి ఆర్థిక సహాయం చేశానో.. నువ్వెంతమందికి చేశావో చర్చకు సిద్ధమా? అంటూ హరీష్‌కు సవాల్ విసిరారు జగ్గారెడ్డి. 

ఇక వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ దక్కాలని పిలుపునిచ్చారు జగ్గారెడ్డి.. కార్యకర్తలు జాగ్రత్తగా ఉండండి, ఇంటిటి ప్రచారం చేయాలని సూచించిన ఆయన..టీఆర్‌ఎస్‌ పార్టీ దగ్గర డబ్బులున్నాయి, కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బులేదు.. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఎవ్వరికీ వారు స్వంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఈ ఎన్నికల్లో పనిచేయాలని పిలుపునిచ్చారు.