సీఎం కేసీఆర్‌కు జగ్గారెడ్డి లేఖ.. ఐదు డిమాండ్లు..

సీఎం కేసీఆర్‌కు జగ్గారెడ్డి లేఖ.. ఐదు డిమాండ్లు..

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు లేఖరాశారు... కాంగ్రెస్ ఎమ్మెల్యే, సీనియర్ నేత జగ్గారెడ్డి... ఆ లేఖ ద్వారా ఐదు డిమాండ్లును ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.. ప్రస్తుతం హౌస్‌ టాక్స్ కట్టే పరిస్థితి లేదు.. కాబట్టి, ఏడాది టాక్స్ మాఫీ చేయాలని కోరిన జగ్గారెడ్డి.. కిరాయి దారులు రెంట్ కట్టే పరిస్ధితిలో లేరు... 6 నెలలు పాటు కిరాయిలు ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఇక, నల్లా బిల్లులు కూడా ఏడాదిపాటు రద్దు చేయాలని విజ్ఞప్తి చేసిన జగ్గారెడ్డి.. పరిశ్రమలకు కూడా రాయితీ ఇవ్వాలన్నారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్న జగ్గారెడ్డి.. ఈ నెల 8వ తేదీలోపు ప్రభుత్వం నుండి స్పందన రాకుంటే... ఈ నెల 9వ తేదీన దీక్ష చేస్తానని ప్రకటించారు. కేంద్రం కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా కోరిన జగ్గారెడ్డి.. ఎంపీలతో కేంద్రం మీద ఒత్తిడి పెంచాలన్నారు. అసలు ఆ విధంగా కేసీఆర్‌ ఎందుకు ఒత్తిడి చేయడం లేదని ఆరోపించిన జగ్గారెడ్డి.. ప్రధాని మోడీ.. సీఎం కేసీఆర్ మధ్య రహస్య ఒప్పందం ఉందని సంచలన ఆరోపణలు చేశారు.