'నీ బిడ్డే చెల్లని రూపాయి..!'

'నీ బిడ్డే చెల్లని రూపాయి..!'

లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్‌ నుంచి మరోసారి పోటీ చేసిన సీఎం కేసీఆర్ కూతురు కవితపై సెటైర్లు వేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి... భువనగిరి ఎంపీ స్థానం నుంచి తన అన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విజయం అనంతరం మీడియాతో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి... నేను కేసీఆర్‌కి, కేటీఆర్‌కి ఛాలెంజ్ చేసి మా అన్నని గెలిపించుకున్నానని ప్రకటించారు. నల్గొండలో చెల్లని రూపాయి భువనగిరిలో చెల్లుతుందా అని మా అన్నను ఎద్దేవా చేశారు... మరి ఇప్పుడు నీ బిడ్డే చెల్లని రూపాయి అయ్యిందని సెటైర్లు వేశారు రాజగోపాల్ రెడ్డి. ఇక జెడ్పీటీసీ ఎన్నికల్లో సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి మూడు జడ్పీ ఛైర్మెన్ సీట్లు కైవసం చేసుకుంటామని సవాల్ చేశారు కోమటిరెడ్డి. మరోవైపు రేపు ఎమ్మెల్సీగా నా సతీమణి లక్ష్మీ కూడా గెలువబోతోందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కుని చేస్తున్న కేసీఆర్ కి ప్రజలు బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు.