ఎమ్మెల్యే చిరుమర్తి సంచలన ప్రకటన

ఎమ్మెల్యే చిరుమర్తి సంచలన ప్రకటన

టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించిన నల్లగొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మరో సంచలన ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచాను కాబట్టి ఈ పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ తరపున మళ్లీ పోటీ చేయనున్నట్లు తాజా ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ది, సంక్షేమ పథకాలను చూసే టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు...తనకు ఎలాంటి పదవిపై ఆశ లేదని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్దికోసం పనిచేస్తుంటే కాంగ్రెస్ అందుకు సహకరనించకపోగా కేసులు, ఫిర్యాదులతో దాన్ని అడ్డుకుంటుందని ఆరోపించారు. ఇలాంటి అభివృద్ది నిరోధకులతో కలిసి ఉండలేకే టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు లింగయ్య తెలిపారు. 

కోమటిరెడ్డి బ్రదర్స్ నీడనే చిరుమర్తి లింగయ్య రాజకీయ ప్రస్తానం కొనసాగింది. అయితే ఆయన అనూహ్యంగా పార్టీ ఫిరాయించడాన్ని స్ధానిక కాంగ్రెస్ నేతలు, కోమటిరెడ్డి బ్రదర్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. లింగయ్య ఫిరాయింపు తమ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపే పరిస్థితి స్పష్టం గా కనిపిస్తుండటంతో కోమటిరెడ్డి బ్రదర్స్ డిఫెన్స్ లో పడ్డారు.