కర్ణాటకలో ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు గుడ్‌బై 

కర్ణాటకలో ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు గుడ్‌బై 

కర్ణాటకలోని కాంగ్రెస్‌-జేడీఎస్‌ ప్రభుత్వానికి ఇవాళ భారీ షాక్‌ తగలింది. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఆనంద్‌ సింగ్‌ ఇవాళ ఉదయం తన పదవికి రాజీనామా చేయగా.. కొద్దిసేపటి క్రితం మరో ఎమ్మెల్యే రమేశ్‌ జర్కిహోలి కూడా రాజీనామా చేశారు. సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన మరో ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా త్వరలోనే తప్పుకోబోతున్నట్టు వార్తలొస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్‌-జేడీఎస్‌ పెద్దలు ఆందోళన చెందుతున్నారు. 

ఇప్పటికిప్పుడు ప్రభుత్వానికి నష్టం ఏమీ లేదని కాంగ్రెస్‌-జేడీఎస్‌ చెబుతున్నాయి. ఎమ్మెల్యేల రాజీనామా వ్యవహారంపై ముఖ్యమంత్రి కుమారస్వామి స్పందించారు. ప్రభుత్వాన్ని కూలదోయాలన్న బీజేపీ కల.. కలగానే మిగిలిపోతుందంటూ ట్వీట్‌ చేశారు. ఎమ్మెల్యేల రాజీనామాపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప తనదైన శైలిలో స్పందించారు. 'మేము ప్రభుత్వాన్ని కూలదోయాలనుకోవడం లేదు. కానీ.. ఒకవేళ ప్రభుత్వం పడిపోతే మాత్రం కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం' అని పేర్కొన్నారు.