కాంగ్రెస్‌కు షాక్.. టీఆర్‌ఎస్‌ గూటికి మరో ఎమ్మెల్యే!

కాంగ్రెస్‌కు షాక్.. టీఆర్‌ఎస్‌ గూటికి మరో ఎమ్మెల్యే!

సార్వత్రిక ఎన్నికల సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాక్‌ల మీదు షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కారెక్కుతుండగా... తాజాగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కూడా గులాబీ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. ఇవాళ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సమావేశమైన సుధీర్‌రెడ్డి... రెండు రోజుల్లో సీఎం కేసీఆర్‌తో భేటీ కానున్నారు. అనంతరం టీఆర్ఎస్‌లో చేరనున్నారాయన. కేటీఆర్‌ను కలిసిన సుధీర్‌రెడ్డి... పలు అంశాలపై చర్చించారు. బీఎన్ రెడ్డిలో రిజిస్ట్రేషన్ సమస్య, ఎల్బీనగర్ లో ఆస్తిపన్ను సమస్యలను కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారాయన. వీటిపై కేటీఆర్ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. ఇక ఎల్బీ నగర్ లో పార్కుల సుందరీకరణకు నిధుల కేటాయింపునకు కూడా కేటీఆర్ అంగీకారం తెలిపినట్టు చెబుతున్నారు సుధీర్‌రెడ్డి.