టీఆర్ఎస్‌ గూటికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే!

టీఆర్ఎస్‌ గూటికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే!

తెలంగాణ కాంగ్రెస్‌లో అసమ్మతి సెగ రేగుతోంది... నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో సీనియర్ నేతగా ఉన్న దామోదర్‌‌రెడ్డి... కాంగ్రెస్‌లో నాగం జనార్థన్ రెడ్డి చేరికను ఆది నుంచీ వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఇక నాగం చేరికను జీర్ణించుకోలేకపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి... కాంగ్రెస్ వీడి... అధికార తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరడానికి సిద్ధమయ్యారు. దీని కోసం మహూర్తం కూడా ఖరారైంది. రేపు సాయంత్రం 6 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి, గులాబిదళపతి కె.చంద్రశేఖర్ రావు సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే జాన్ అబ్రహం, కాంగ్రెస్ నేత ఎడ్మ కృష్ణారెడ్డి కూడా రేపు సాయంత్రం గులాబీ కండువా కప్పుకోనున్నారు.