సీఎల్పీని విలీనం చేసుహక్కు ఏఐసీసీకే..!

సీఎల్పీని విలీనం చేసుహక్కు ఏఐసీసీకే..!

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలోకి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను లాగేసి.. సీఎల్పీని టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం చేసేందుకు టీఆర్ఎస్ నేతలు ప్రయత్నం చేస్తున్నారనే వార్తలు ఇప్పడు పొలిటికల్ హీట్ పెంచాయి. ఓ ముగ్గురు ఎమ్మెల్యేలు తప్ప తాజాగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు మొత్తం కారెక్కుతారని.. ఆ తర్వాత సీఎల్పీ విలీనం చేస్తారనే చర్చ సాగుతోంది. అయితే, సీఎల్పీని విలీనం చేసే హక్కు ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ)కి మాత్రమే ఉంటుందన్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి... లేని అధికారాన్ని కల్పించుకోవటం.. రాజ్యాంగ వ్యతిరేకమే అవుతుందని ఆయన మండిపడ్డారు. మరోవైపు రెవెన్యూ ప్రక్షాళన ఇప్పుడు గుర్తుకు వచ్చిందా? అంటూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుపై మండిపడ్డారు జీవన్ రెడ్డి... గత ఐదేళ్లుగా ఏం చేశావు అంటూ నిలదీశారు.