ఎంపీపీగా చెల్లని రూపాయి, ఎంపీగా చెల్లుతుందా!

ఎంపీపీగా చెల్లని రూపాయి, ఎంపీగా చెల్లుతుందా!

నల్లగొండ లోక్ సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం నెరడుగొమ్ము, చందంపేట మండలాల్లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ అభ్యర్ధి నర్సింహారెడ్డి పై నిప్పులు చెరిగారు. మునుగోడులో ఎంపీపీగా చెల్లని రూపాయి, నల్లగొండ ఎంపీగా చెల్లుతుందా అని ఎద్దేవా చేశారు. పేద ప్రజల భూములు లాక్కున్న నర్సింహారెడ్డి డబ్బుతో గెలవాలని చూస్తున్నాడని ఆరోపించారు. ఆయన ఇచ్చే డబ్బులు తీసుకుని కాంగ్రెస్ కు ఓటేయాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలు మోడీ, రాహుల్ మధ్య జరిగే ఎన్నికలని తెలిపారు. నన్ను ఎంపీగా గెలిపిస్తే.. ఈ ప్రాంత సమస్యలపై పార్లమెంట్ లో గళమెత్తుతానని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి ప్రజల ముందు మైక్ పట్టుకుని ఏమీ మాట్లాడటంలేదు, గెలిచి రేపు పార్లమెంట్ లో ఏమి మాట్లాడుతారని ఉత్తమ్ వ్యాఖ్యానించారు.