గవర్నర్ ను కలిసిన కాంగ్రెస్ ఎంపీ కేవీపీ

గవర్నర్ ను కలిసిన కాంగ్రెస్ ఎంపీ కేవీపీ

కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు గురువారం గవర్నర్ నరసింహన్ ను కలిశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై గవర్నర్ కు ఆయన రిప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రాజెక్టు నిర్మాణంపై శ్వేతపత్రం ఇచ్చేలా ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. పోలవరంపై ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై కౌంటర్‌ వేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై ఆధారాలతో సహా గవర్నర్‌కు వివరించాని కేవీపీ వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విభజన చట్టాన్ని ఉల్లంఘించాయని, పోలవరం పూర్తి ఖర్చును కేంద్రమే భరించాలని గతంలో యూపీఏ ప్రభుత్వం నిర్ణయించిందని కాంగ్రెస్‌ నేత కేవీపీ గుర్తుచేశారు.