బాబుకు ఆ నాలుగు తప్ప మరొకటి తెలియదు!

బాబుకు ఆ నాలుగు తప్ప మరొకటి తెలియదు!
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తెలిసిందల్లా అవకాశ వాదం, ఆత్మవంచన, వెన్నుపోటు, కాళ్లు పట్టుకుని లాగేయడం... తప్ప మరొకటి లేనేలేదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు... ప్రత్యేక హోదాకు మద్దతుగా రాహుల్ గాంధీతో సహా శరద్ యాదవ్, అఖిలేష్ యాదవ్, సురవరం సుధాకర్ రెడ్డి లాంటి అగ్రనేతలు పాల్గొన్న సభను “రాష్ట్ర ద్రోహుల సభ” అని అభివర్ణించిన చంద్రబాబు... ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో ప్రత్యేక హోదా గురించి మాట్లాడిన నేతలపై అక్రమ కేసులు పెట్టినందుకు కూడా ఏపీ సీఎం క్షమాపణలు కోరాలన్నారు కేవీపీ. ప్రత్యేక ప్యాకేజీపై బీజేపీ లెక్కలు అడుగుతుందని తెలిసిన తర్వాతే చంద్రబాబుకు 'ప్రత్యేక హోదా' గురించి మళ్లీ గుర్తుకువచ్చిందని ఆరోపించిన కేవీపీ... చంద్రబాబు 'నంది' అవార్డు స్థాయికి మంచిన నటుడని... ప్రధాని నరేంద్ర మోదీ ఆస్కార్ స్థాయికి మించిన నటుడని మండిపడ్డారు. చంద్రబాబు అఖిల పక్ష భేటీ అంటూ చేసిన విపరీత చేష్టలు చూస్తుంటే, ఆయన గల్లీ స్థాయి కంటే తక్కువ స్థాయి నటుడని తేలిపోయిందని ఎద్దేవా చేశారు కేవీపీ. ఏపీ రైతుల రక్తాన్ని పిండి చంద్రబాబు హెరిటేజ్ లాభాలు పొందారని ఆరోపించిన కాంగ్రెస్ సీనియర్ నేత... ఏపీ ప్రజల నుంచి అమరావతి నిర్మాణం కోసం నిధులు సేకరించడానికి ముందు, చంద్రబాబు తన హెరిటేజ్‌లో వచ్చే మూడేళ్ల లాభాలను ఇచ్చేందుకు తీర్మానం చేయాలన్నారు. అలా తీర్మానం చేసినప్పుడే చంద్రబాబు చిత్తశుద్దిని కొంతైనా ప్రజలు విశ్వసించే అవకాశం ఉంటుందన్నారు కేవీపీ.