భోపాల్ కాంగ్రెస్ అభ్యర్థిగా దిగ్విజయ్ సింగ్

భోపాల్ కాంగ్రెస్ అభ్యర్థిగా దిగ్విజయ్ సింగ్

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ లోక్ సభ ఎన్నికల్లో భోపాల్ నుంచి బరిలోకి దిగుతున్నారు. శనివారం కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ నిర్ణయాన్ని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ప్రకటించారు.

మధ్యప్రదేశ్ లో 29 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ ను 4, 5, 6, 7 దశల్లో నిర్వహించనున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. అంటే ఓటింగ్ ఏప్రిల్ 29, మే 6, మే 12, మే 19 తేదీల్లో జరుగుతుంది.

15 ఏళ్ల తర్వాత ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతుల్లో ఓటమి పాలైన తర్వాత బీజేపీ మధ్యప్రదేశ్ లో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది. 

2014 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మధ్యప్రదేశ్ బలమైన ఆధారంగా నిలిచింది. కమలం పార్టీ 29లో 27 లోక్ సభ స్థానాలు గెలుచుకుంది. మిగతా రెండు స్థానాలు, ఛింద్వారా, గుణలలో కమల్ నాథ్, జ్యోతిరాదిత్య సింధియా విజయం సాధించారు.