నాకు 123.. నీకు 125.. మహాలో పంపకాలు పూర్తి..!! 

నాకు 123.. నీకు 125.. మహాలో పంపకాలు పూర్తి..!! 

మహారాష్ట్రా అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి.  ఈ ఏడాది చివర్లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉన్నది.  త్వరలోనే ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నది.  కాగా, కాంగ్రెస్ పార్టీ అప్పుడే సీట్లు సర్దుబాట్లకు సంబంధించిన విషయాలపై దృష్టి పెట్టింది.  కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ముఖ్యమంత్రి పృథ్విరాజ్ చవాన్ సీట్ల పంపకం గురించి వ్యవహారం పూర్తయినట్టు చెప్పారు.  యూపీఏలో భాగస్వామిగా ఉన్న ఎన్సీపీకి 125 స్థానాలు కేటాయించింది.  కాంగ్రెస్ పార్టీ 123 చోట్ల పోటీ చేస్తుంది.  

రాష్ట్రంలోని కలిసి పనిచేసే మిగతా పార్టీల కోసం 41 స్థానాలు కేటాయించారు.  మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.  2014లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 122 స్థానాల్లో విజయం సాధిస్తే.. శివసేన 63 స్థానాల్లో విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ 42, ఎన్సీపీ 41 స్థానాల్లో విజయం సాధించింది.  ఎన్నికలు పూర్తయ్యాక శివసేన బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.  ఈసారి ఎలాగైనా మెజారిటీ స్థానాలు గెలిచి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని శివసేన చూస్తున్నది.  తిరిగి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.  మరి ఓటర్లు ఎవరికీ పట్టం కడతారో చూడాలి.