కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. ఢిల్లీకి రేవంత్..

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. ఢిల్లీకి రేవంత్..

ఢిల్లీలో శనివారం ఉదయం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పాల్గొనడం కోసం ఇప్పటికే హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ వెళ్లారు మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి. ఇక ఇవాళ సాయంత్రం భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హస్తినకు వెళ్లనుండగా... పీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. రేపు ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు. ఇక రేపు నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసిన విజయం సాధించిన 52 మంది ఎంపీలు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో లోక్ సభ, రాజ్యసభలో ప్రతిపక్ష నేతలను ఎన్నుకోనున్నారు.