సీఎల్పీని విలీనం చేయండి.. స్పీకర్‌కు లేఖ..

సీఎల్పీని విలీనం చేయండి.. స్పీకర్‌కు లేఖ..

సీఎల్పీని టీఆర్ఎస్‌ శాసన సభాపక్షంలో విలీనం చేయాలని స్పీకర్ పోచారం శ్రీనివార్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు టీఆర్ఎస్‌ పార్టీలో చేరడానికి సిద్ధమైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు... టీఆర్ఎస్‌ఎల్పీలో సీఎల్పీని విలీనం చేయాలంటూ స్పీకర్‌ను కలిశారు 12 మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు. స్పీకర్‌ను కలిసినవారిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, ఆత్రం సక్కు, హరిప్రియ, జాజుల సురేందర్, హర్షవర్ధన్ రెడ్డి, సుధీర్‌రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, రేగ కాంతారావు, పైలెట్ రోహిత్ రెడ్డి, కందాల ఉపేందర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య ఉన్నారు. సీఎం కేసీఆర్ నాయత్వంలో  పనిచేయడానికి 12 మంది ఎమ్మెల్యేలం సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి.