ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ సంచలన నిర్ణయం..

ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ సంచలన నిర్ణయం..

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై సంచలన నిర్ణయం తీసుకుంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. ఓవైపు రేపు నిర్వహించనున్న ఈ ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి... మరోవైపు టీఆర్ఎస్ తన ఎమ్మెల్యేలకు మాక్ పోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో.. ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేసీఆర్ రెండో సారి అధికారంలోకి వచ్చాక రాజనీతిజ్ఞుడిగా ఉంటారు అనుకున్నాం.. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికల్లో కూడా మేం సహకరించాం.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాకున్న సంఖ్యాబలం ప్రకారం ఒక సీటు గెలవాలి... కానీ, తెలంగాణ ప్రజలు సిగ్గుపడేలా కేసీఆర్.. వికార.. వికృత చర్యలకు పాల్పడుతూ.. టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టారని. పార్టీ ఫిరాయింపులను నేరుగా సీఎం ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. దీంతో సీఎం కేసీఆర్‌ తీరుకు నిరసనగా ఎమ్మెల్సీ ఎన్నికలను బై కాట్ చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు.