ఓరుగల్లుపై దృష్టిపెట్టిన కాంగ్రెస్... 

ఓరుగల్లుపై దృష్టిపెట్టిన కాంగ్రెస్... 

ఓరుగల్లు కోటలో  జెండా ఎగరేసేందుకు కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతున్నది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం తరువాత త్వరలోనే జరగబోతున్న వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై దృష్టి సారించింది.  జీహెచ్ఎంసిలో చేసిన తప్పులను పునరావృతం కాకుండా చూసుకుంటూ ఎన్నికల బరిలో నిలవాలని, మేయర్ పదవిని సాధించాలని చూస్తోంది.  వరంగల్ అనగానే గుర్తుకు వచ్చేది కొండా మురళి, కొండా సురేఖ దంపతులు.  వైఎస్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రోజుల్లో కొండా సురేఖ మంత్రిగా పనిచేశారు.  వరంగల్ పై మంచి పట్టు ఉన్నది.  రాష్ట్రం విడిపోయిన తరువాత కొండా దంపతులు టిఆర్ఎస్ లో చేరారు. అయితే, పార్టీ కొండా దంపతులకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో టిఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి తిరిగి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు.   వరంగల్ కార్పొరేషన్ కు త్వరలోనే ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కొండా దంపతులను యాక్టివ్  సిద్ధం అయ్యింది.  వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపించే బాధ్యత కొండా దంపతులకు అప్పగించాలని పార్టీ చూస్తున్నది.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఠాకూర్ ఇప్పటికే కొండా దంపతులతో ఈ విషయం గురించి మాట్లాడినట్టు సమాచారం.