కాంగ్రెస్ కు అదే పెద్ద సమస్య..!!

కాంగ్రెస్ కు అదే పెద్ద సమస్య..!!

2014 కు ముందు వరకు దేశంలో కాంగ్రెస్ పార్టీ హవా నడిచింది.  2014 తరువాత పార్టీ పరిస్థితి ఒక్కసారిగా తలక్రిందులైంది.  2014 ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓటమిపాలయ్యాక నాయకత్వంలో మార్పులు చేర్పులు చేసుకుంటూ వచ్చింది.  మార్పులు చేసినా.. పెద్దగా కలిసిరాలేదు.  2019 ఎన్నికల తరువాత పార్టీ పరిస్థితి మరింత అద్వాన్నంగా మారిపోయింది. పార్టీ ఓటమికి భాద్యత వహిస్తూ.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీ పదవికి రాజీనామా చేశారు. 

అనేక నాటకీయ పరిణామాల మధ్య ఆయన రాజీనామాను అంగీకరించారు.  ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీని నియమించారు.  తాను కేవలం తాత్కాలిక అధ్యక్షురాలినే అని చెప్పింది.  శాస్వత అధ్యక్ష పదవిని నియమించే ఉద్దేశ్యం కాంగ్రెస్ పార్టీకి ఉన్నదా లేదా అన్నది తెలియాలి.  అక్టోబర్ 21 వ తేదీన మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి.  ఇదిలా ఉంటె, 2019 సార్వత్రిక ఎన్నికల తరువాత పరాజయానికి కారణమైన వైఫల్యాలను గుర్తించడంలో జాప్యం జరిగిందని, ఫలితంగా పార్టీ మనుగడ ప్రశ్నర్ధకంగా మారిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షిద్ పేర్కొన్నారు. ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయాము అనే దానిపై ఇప్పటి వరకు సమగ్రంగా విచారణ జరగలేదని, నాయకత్వ లోపం కారణంగా వచ్చే ఎన్నికల్లో గెలుపు కష్టంగా మారుతుందని అన్నారు.  మరి దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.