బాండ్‌ పేపర్‌ రాసిస్తేనే బీఫామ్..!

బాండ్‌ పేపర్‌ రాసిస్తేనే బీఫామ్..!

ఓ పార్టీ నుంచి బీఫామ్ పొందండం.. గెలిచాక మరో పార్టీలో చేరడం మామూలైపోయింది. స్థానిక సంస్థల నుంచి ఎంపీ స్థాయి వరకూ పార్టీ ఫిరాయింపులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే, కాంగ్రెస్ పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. గెలిచిన తర్వాత తాము పార్టీ వీడబోమంటూ బాంబ్ పేపర్ రాసిచ్చినవారికే బీఫామ్‌ ఇస్తోంది. వివరాల్లోకి వెళ్తే కామారెడ్డిలో గెలిచిన తర్వాత పార్టీ మారబోమంటూ బాండ్ పేపర్ రాసిచ్చే అభ్యర్థులకే టికెట్ ఇవ్వాలంటూ మాజీ మంత్రి షబ్బీర్ అలీని కోరారు స్థానిక కార్యకర్తలు. మన పార్టీ బిఫామ్ మీద పోటీ చేసి గెలవగానే టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారంటూ షబ్బీర్ అలీ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, కామారెడ్డి జిల్లాలో జరుగుతోన్న తొలి విడత ఎన్నికల కోసం అభ్యర్థులకు బీఫారమ్‌లు ఇచ్చే సమయంలో ఇది చర్చగా మారింది. దీంతో పార్టీ మారబోమని హామీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు. మొదటి విడత ఎన్నికలు జరుగుతున్న 9 మండలాలకు చెందిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు షబ్బీర్ అలీ సమక్షంలో బాండ్ పేపర్ పై లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చి బీఫామ్‌లు తీసుకున్నారు.