కాంగ్రెస్ విజన్ ఉన్న పార్టీ-రాజనర్సింహ

కాంగ్రెస్ విజన్ ఉన్న పార్టీ-రాజనర్సింహ

కాంగ్రెస్ విజన్ ఉన్న పార్టీ అన్నారు మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ... టీఆర్ఎస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన అల్లాదుర్గం ఎంపీపీ ఇందిర... సంగారెడ్డిలో రాజనరసింహ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నాలుగేళ్ల పైబడిన టీఆర్ఎస్ పాలనలో మోసం, దగా, అబద్దాలతో కూడిన పాలన తప్ప... చేసింది ఏమీలేదని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో కుటుంబ పాలనకు చెరమగీతం పాడాలని పిలుపునిచ్చి రాజ నరసింహ... స్వేచ్ఛ, పారదర్శకత, జవాబుదారీ పాలన కావాలి... అది కాంగ్రెస్‌తోనే సాధ్యం అన్నారు. వాగ్దానాలు నిలబెట్టుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీదే నన్న ఆయన... ఆందోల్ తో పాటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందన్న విశ్వాసం ఉందన్నారు.