ఇంటర్‌ ఫలితాలపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు

ఇంటర్‌ ఫలితాలపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు

ఇంటర్మీడియట్ ఫలితాల్లో అవకతవకలను నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు కాంగ్రెస్ పార్టీ నేతలు. పలు జిల్లాల్లో కలెక్టరేట్ల దగ్గర నిరసనలు తెలిపారు. సూర్యాపేట్ కలెక్టరేట్ ఎదుట పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధర్నాకు దిగితే.. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు ఆయా ప్రాంతాల్లో ఆందోళనలో పాల్గొన్నారు. వరంగల్‌లో విజయశాంతిని అరెస్ట్ చేశారు. ఇంటర్ బోర్డు తప్పిదాలను నిరసిస్తూ హన్మకొండలోని ఏకశిలా పార్కు దగ్గర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నం చేశారు... దీంతో విజయశాంతి, పలువురు నేతలను అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్‌లో అంజన్ కుమార్, కోదండరామిరెడ్డిని, రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యను అరెస్ట్ చేశారు. సూర్యాపేటలో పీసీసీ చీఫ్ ను అరెస్ట్ చేశారు. ఇంటర్ బోర్డులో అవకతవలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు.