సీఎల్పీ విలీనంపై హైకోర్టుకు కాంగ్రెస్..

సీఎల్పీ విలీనంపై హైకోర్టుకు కాంగ్రెస్..

టీఆర్ఎస్‌ఎల్పీలో సీఎల్పీ విలీనం చేసేందుకు అధికార టీఆర్ఎస్ పక్షం తీవ్ర ప్రయత్నాలు చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన 11 మంది ఎమ్మెల్యేలు కారెక్కగా.. మరో ఇద్దరిని టీఆర్ఎస్‌లో చేర్చుకుంటే.. సీఎల్పీ విలీనానికి రాజ్యాంగపరమైన అడ్డంకులు ఉండవని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ఈ వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయించింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ... టీఆర్ఎస్‌ఎల్పీలో సీఎల్పీ విలీనం చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టులు రేపు (మంగళవారం) విచారణ జరగనుంది.