మోడీకి కాంగ్రెస్ సూపర్ గిఫ్ట్... ఎందుకంటే... 

మోడీకి కాంగ్రెస్ సూపర్ గిఫ్ట్... ఎందుకంటే... 

దేశంలో గత కొంతకాలంగా పౌరసత్వం బిల్లుకు సంబంధించిన గొడవలు జరుగుతున్నాయి. ఇటీవలే ఈ బిల్లుకు చట్టబద్దత లభించింది.  బిల్లు ఆమోదం పొందటంతో గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి అమలు చేస్తున్నారు.  ఈ చట్టాన్ని మొదటగా కర్ణాటకలో అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.  కర్ణాటకలో దీనిని అమలు చేసి ఆ తరువాత మిగతా రాష్ట్రాల్లో అమలు చేయడానికి సిద్ధం అవుతున్నారు. 

అయితే, చాలా రాష్ట్రాలు దీనికి ఒప్పుకోవడం లేదు.  పౌరసత్వ చట్టం వలన మైనారిటీలకు ఇండియాలో ఇబ్బందులు వస్తాయని అంటున్నారు.  అసలు ఈ చట్టానికి, మైనారిటీలకు సంబంధం లేదని ఎంత చెప్తున్నా సరే పట్టించుకోవడం లేదు.  ప్రతిపక్షాలు మొత్తం కలిసి సిఏఏ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాయి.  ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రధాని మోడీకి ఓ గిఫ్ట్ ను అందించింది.  అదేమంటే భారత రాజ్యాంగం.  అమెజాన్ లో భారత రాజ్యాంగ ప్రతిని కొనుగోలు చేసింది.  ఈ ప్రతిని త్వరలోనే మోడీకి అందుతుంది.  రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం దేశంలో ప్రతి ఒక్కరు సమానమే అనే విషయం తెలుసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మోడీకి చెప్తున్నది.  మరి కాంగ్రెస్ ఇచ్చిన గిఫ్ట్ కు మోడీ ఎలాంటి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారో చూడాలి.